TSPSC గ్రూప్ – 2 సిలబస్ | Study Material in Telugu
https://www.youtube.com/watch?v=Ni2qKXMzCco
పరీక్ష విధానం | ||||
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు (అబ్జెక్టివ్ విధానం) | సమయం | గరిష్ఠ మార్కులు |
పార్ట్ – ఎ | రాత పరీక్ష (అబ్జెక్టివ్ విధానం) | |||
పేపర్ – 1 | జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ | 150 | 2.30 గంటలు | 1.50 |
పేటర్ – 2 | చరిత్ర, రాజ్యాంగం మరియు సమాజం 1. భారత, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర 2. భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం 3. సాంఘిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు/ పథకాలు |
150 (3 × 50) | 2.30 గంటలు | 150 |
పేపర్ – 3 | ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 1. భారతదేశ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు 2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 3. అభివృద్ధి సమస్యలు, మార్పు |
150 (3 × 50) | 2.30 గంటలు | 150 |
పేపర్ – 4 | తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు 1. ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 – 70) 2. సమీకరణ దశ (1971 1990) 3. తెలంగాణ ఏర్పాటు దిశగా (1991 – 2014 వరకు) |
150 (3 × 50) | 2.30 గంటలు | 150 |
పార్ట్ – బి | ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) | 75 | ||
మొత్తం మార్కులు | 675 |
సిలబస్
పేపర్ -1 (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్)
1. కరెంట్అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ సమస్యలు: విపత్తు నివారణ – నిరోధం, తగ్గించే ఉపాయాలు
5. ప్రపంచ, భారతదేశ, తెలంగాణ భూగోళ శాస్త్రం
6. భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
7. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం
8. తెలంగాణ రాష్ట్ర విధానాలు/ పథకాలు
9. సామాజిక వర్ణణ (సోషల్ ఎక్స్‌క్లూజన్): హక్కుల అంశాలు, సమ్మిళిత విధానాలు
10. లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
11. బేసిక్ ఇంగ్లిష్ (10వ తరగతి స్థాయి)
పేపర్ -2 (చరిత్ర, రాజ్యాంగం, సమాజం)
1. భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర:
1) సింధూ నాగరికత ముఖ్యలక్షణాలు – సమాజం, సంస్కృతి – తొలి, మలి వైదిక నాగరికతలు; క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు మత ఉద్యమాలు – జైన, బౌద్ధ మతాలు; మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, చోళుల సామాజిక, సాంస్కృతిక విశేషాలు, కళలు, ప్రసిద్ధ కట్టడాలు. హర్షుల, రాజపుత్ర యుగం.
2) ఇస్లాం రాక, ఢిల్లీ సుల్తాన్ల రాజ్యస్థాపన; సుల్తానత్ రాజ్యంలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు; సూఫీ, భక్తి ఉద్యమాలు; మొగలుల సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, భాష, సాహిత్యం, కళలు, ప్రసిద్ధ కట్టడాలు; మరాఠుల ఉద్భవం, సాంస్కృతిక పాత్ర; దక్షిణ భారతదేశంలో బహమనీ, విజయనగర రాజ్యాల్లో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు – సాహిత్యం, కళలు, ప్రసిద్ధ నిర్మాణాలు.
3) యూరోపియన్ల రాక: బ్రిటిష్ పరిపాలన ప్రారంభం, విస్తరణ: సామాజిక విధానాలు – కారన్‌వాలీస్, వెల్లస్లీ, విలియం బెంటింక్, డల్హౌసీ, ఇతరులు – 19వ శతాబ్దంలో సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు. భారతదేశంలో సామాజిక ఉద్యమాలు – జ్యోతిబాపూలే, సావిత్రిభాయిపూలే, అయ్యంకాళి, నారాయణగురు, పెరియర్ రామస్వామి నాయకర్, గాంధీ, అంబేడ్కర్ మొదలైనవారు.
4) ప్రాచీన తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు – శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు. మతం, భాష, సాహిత్యం, కళలు, ప్రసిద్ధ కట్టడాలు. మధ్యయుగ తెలంగాణ: కాకతీయుల రాచకొండ, దేవరకొండ, వెలమల; కుతుబ్‌షాహీల – సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి. మిశ్రమ సాంస్కృతిక ఆవర్భావం: జాతరలు, పండగలు, మొహర్రం, ఉర్సు మొదలైనవి.
5) అసఫ్‌జాహీ సామ్రాజ్య స్థాపన: నిజాం ఉల్‌ముల్క్ నుంచి మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు – సాలార్జంగ్ సంస్కరణలు – సామాజిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు – జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు – వెట్టీ, భగేల వ్యవస్థ, అప్పటి స్త్రీల పరిస్థితులు. తెలంగాణలో సామాజిక – సాంస్కృతిక ఉద్యమాల ఆవిర్భావం – ఆర్యసమాజం, ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ ఉద్యమాలు, గ్రంథాలయ, సాంస్కృతిక ఉద్యమాలు. షెడ్యూల్డ్ తెగల, రైతుల తిరుగుబాట్లు. రాంజీగోండు, కొమరం భీమ్, తెలంగాణ రైతుల సాయుధ పోరాటాలు – పోలీసు/ సైనిక చర్య, నిజాం పాలన అంతం.
త్వాలు – రాష్ట్రపతి – ప్రధానమంత్రి, మంత్రి మండలి, గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి – అధికారాలు, విధులు.2. భారత రాజ్యాంగం, రాజకీయాలు:
* భారత రాజ్యాంగ పరిణామ క్రమం – స్వభావం, ప్రధానాంశాలు – ప్రవేశిక.
* ప్రాథమిక హక్కులు – ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు
* భారత సమాఖ్య విధాన ముఖ్య లక్షణాలు – కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన అధికారాల పంపిణీ.
* కేంద్ర, రాష్ట్ర ప్రభు
* గ్రామీణ, పట్టణ ప్రాంత (స్థానిక, పురపాలక) పరిపాలన 73వ, 74వ రాజ్యాంగ సవరణల అనుకూలంగా.
* ఎన్నికల వ్యవస్థ – స్వేచ్ఛ, నిజాయతీతో కూడిన ఎన్నికలు – దుష్ప్రవర్తన, ఎలక్షన్ కమిషన్ – ఎలక్టోరల్ సంస్కరణలు, రాజకీయ పార్టీలు
* భారతదేశంలో న్యాయవ్యవస్థ – న్యాయవ్యవస్థ క్రియాశీలత
* ఎ) షెడ్యూలు కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల, స్త్రీల, మైనార్టీల ప్రత్యేక నిబంధనలు.
బి) సంక్షేమ యంత్రాంగం – షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిటీ, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిటీ, వెనుకబడిన తరగతుల జాతీయ కమిటీ
* భారత రాజ్యాంగం – నూతన సవాళ్లు
3. సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు:
భారత సమాజ నిర్మాణం:
* భారతీయ సమాజ ముఖ్య లక్షణాలు: కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, జాతి, స్త్రీలు, మధ్యతరగతి – తెలంగాణ రాష్ట్ర సామాజిక సాంస్కృతిక లక్షణాలు
సామాజిక సమస్యలు:
* అసమానతలు, బహిష్కరణలు – కులవ్యవస్థ, మతవ్యవస్థ, ప్రాంతీయ వ్యవస్థ, స్త్రీ బలత్కారాలు, బాలకార్మికులు, మానవ అక్రమ రవాణ, వికలాంగులు, వృద్ధులు
సామాజిక ఉద్యమాలు:
* రైతు ఉద్యమాలు, షెడ్యూల్డ్ తెగల ఉద్యమాలు, వెనకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు, మానవహక్కుల ఉద్యమాలు
తెలంగాణలో ప్రత్యేక సామాజిక సమస్యలు:
* వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ – బాల కార్మికులు, స్త్రీ, శిశువు, ఫ్లోరోసిస్, వలసలు, రైతు మరియు నేత కార్మికుల ఇబ్బందులు / ఆపదలు, వికలాంగుల, పిల్లలకు సంబంధించి నిర్ణయాత్మక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు – ఉద్యోగ కల్పన, సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్త్రీలు, మైనార్టీలు, కార్మిక, పేదరిక నిర్మూలన పథకాలు; గ్రామీణ/ పట్టణ స్త్రీల, పిల్లల సంక్షేమం; షెడ్యూల్డ్ తెగల సంక్షేమం.
పేపర్ -3 (ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి)
I. భారత ఆర్థిక వ్యవస్థ – సమస్యలు, సవాళ్లు:
* వృద్ధి, అభివృద్ధి: వృద్ధి, అభివృద్ధి భావనలు – పెరుగుదల , అభివృద్ధిల సంబంధం.
* ఆర్థికాభివృద్ధి సూచిక – కొలమానాలు: జాతీయాదాయం – నిర్వచనం, జాతీయాదాయాన్ని లెక్కించే పద్ధతులు, నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం.
* పేదరికం, నిరుద్యోగం – పేదరిక భావనలు – ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయేతర పేదరికం; పేదరిక కొలమానాలు; నిరుద్యోగిత – నిర్వచనం, నిరుద్యోగిత రకాలు.
* భారత ఆర్థికవ్యవస్థలో ప్రణాళికలు – ముఖ్య ఉద్దేశాలు, ప్రాముఖ్యతలు, వ్యూహాలు, పంచవర్ష ప్రణాళిక విజయాలు – 12వ పంచవర్ష ప్రణాళిక, ప్రణాళిక అభివృద్ధి, నీతి ఆయోగ్ కమిటీ.
II. తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి:
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థికవ్యవస్థ (1956 – 2014) – అణచివేత తీరు (బచావత్ కమిటీ), ఆర్థికాంశాలు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి (జై భారత్ కమిటీ, గిర్గ్లానీ కమిటీ), అభివృద్ధి పథంలో.
* తెలంగాణలో భూ సంస్కరణలు – మధ్య దళారీల తొలగింపు – జమీందారీ, ఇనాందారీ వ్యవస్థలు – కౌలు సంస్కరణలు – భూ పరిమితి – షెడ్యూల్డ్ ప్రాంతాల వారికి కేటాయించిన భూమి.
* వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమలు – జీఎస్డీపీలో వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమల వాటా – భూ పంపిణీ – వ్యవసాయ ఆధారం – నీటి పారుదల – నీటి పారుదల సౌకర్యాలు – బీడు భూముల సమస్యలు – వ్యవసాయ పరపతి.
* పరిశ్రమలు, సేవల రంగాలు – పారిశ్రామికాభివృద్ధి – పరిశ్రమల నిర్మాణం, పెరుగుదల – స్థూల, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల స్థాపన – తెలంగాణ పారిశ్రామిక తీర్మానం – సేవారంగ అభివృద్ధి, నిర్మాణం.
III. అభివృద్ధి సమస్యలు, మార్పు:
* అభివృద్ధి పోకడలు – భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు – సామాజిక అసమానతలు – కుల, తెగ, మతం, లింగ బేధాలు – వలసలు – పట్టణీకరణ.
* అభివృద్ధి, స్థానచలనం – భూసేకరణ పద్ధతులు – పునః సంస్కరణలు, పునరావాసం.
* ఆర్థిక సంస్కరణలు – పేదరిక, అసమానతల పెరుగుదల – సామాజిక అభివృద్ధి (విద్య – ఆరోగ్యం), సామాజిక మార్పు, సామాజిక భద్రత.
* సుస్థిర అభివృద్ధి – భావనలు, అంచనా – సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.
పేపర్ – 4 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం
1. ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 – 70):
* చారిత్రక నేపథ్యం – హైదరాబాద్ రాచరిక రాష్ట్ర వ్యవస్థలో తెలంగాణ భూగోళ, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక లక్షణాలు – తెలంగాణ ప్రజలు – కులాలు, తెగలు, మతం, కళలు, హస్తకళలు, భాషలు, జాతి భాషలు, జాతరలు, పండగలు, తెలంగాణలో చూడదగిన ప్రదేశాలు. హైదరాబాద్ రాష్ట్ర రాజరిక పరిపాలన, సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలు. ముల్కీ, ముల్కీయేతర నిబంధనలు, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉద్యోగాలు, పౌర సేవల చట్టాలు; 7వ నిజాం యొక్క 1919 ఫర్మానా – నిజాం స్థాపన; 1935 ముల్కీ లీగ్ నిబంధనలు, వాటి ప్రాధాన్యత; 1948లో భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్ర చేరిక – వెల్లోడి, సైనిక పాలనలో ఉద్యోగ విధానాలు. 1948-52 – ముల్కీ నిబంధనల ఉల్లంఘన, దాని పర్యవసానాలు.
* స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం – బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో మంత్రిమండలి, 1952 ముల్కీ నిబంధనల ఆందోళన – ప్రాంతీయ ప్రజల ఉద్యోగాల కోసం పోరాటం, సిటీ కాలేజ్ ఘటన, దాని ప్రాముఖ్యత. జస్టిస్ జగన్మోహన్రెడ్డి కమిటీ రిపోర్ట్, 1953 – ప్రాథమిక వాదనలు, తెలంగాణ కోసం డిమాండ్ – స్టేట్ రీ-ఆర్గనైజేషన్ కమిషన్ (ఎస్ఆర్సీ) 1953లో ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పాటుకు కారణాలు – పునర్ వ్యవస్థీకరణ ముఖ్య సూచనలు – పునర్ వ్యవస్థీకరకణ, చిన్న రాష్ట్రాలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భావనలు.
* ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1956 – పెద్ద మనుషుల ఒప్పందం – అందులోని సూచనలు – తెలంగాణ ప్రాంతీయ కమిటీ, దాని ఏర్పాట్లు, విధులు, పనితనం – కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజల వలసల ప్రభావం, దాని పర్యవసనాలు – తెలంగాణలో 1970 తర్వాత అభివృద్ధి పరిస్థితులు – వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్, విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్యం మొదలైనవి.
* ఉద్యోగ, సర్వీసు నిబంధనల ఉల్లంఘన – తెలంగాణ ఆందోళనకు గల మూల కారణాలు – కొత్తగూడెం, ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకతలు/ ఆందోళనలు – రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష, 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళనలు – జై తెలంగాణ ఉద్యమంలో మేధావుల, విద్యార్థుల, ఉద్యోగుల పాత్ర.
* తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు – ఉద్యమ విధి విధానాలు – తెలంగాణ ఉద్యమ వ్యాప్తి – ప్రధాన ఘటనలు – నాయకులు, ముఖ్య వ్యక్తులు – అన్ని పార్టీల సమ్మతి – జీవో 36 – తెలంగాణ ఉద్యమ అణచివేత పర్యవసానాలు – 8, 5 సూత్రాల ఫార్ములా అమలు.
2. సమీకరణ దశ (1971 – 90):
* ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు – జై ఆంధ్ర ఉద్యమం, దాని పర్యవసానాలు – 6 సూత్రాల పథకం అమలు 1973 – దాని ఏర్పాటు – ఆర్టికల్ 371 డి – రాష్ట్రపతి ఆజ్ఞ – 1975 ఆఫీసర్స్ (జయభారత్‌రెడ్డి కమిటీ రిపోర్ట్, జీవో 610 (1985) – అతిక్రమణ, ఆందోళనలు – తెలంగాణ ఉద్యోగుల ప్రతిచర్య, ప్రాతినిధ్యాలు.
* నక్సలైట్ ఉద్యమం ఆవిర్భావం, ఉద్యమ వ్యాప్తి – ఉద్యమానికి కారణాలు, దాని పర్యావసనాలు – ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్లలో భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు – రైతు కూలీల సంఘాలు – ఆదివాసీ భూ ఆక్రమణ, ఆదివాసీల వ్యతిరేకత/ అడ్డగింత – జల్, జంగిల్, జమీన్ నినాదాలు.
* 1980లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం – తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు – తెలుగుజాతి భావనలు, తెలంగాణ గుర్తింపు అణచివేత – హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు నూతన ఆర్థిక వ్యాప్తి – రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఆర్థిక సంస్థలు, సినిమాలు, మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలు – కార్పొరేట్ విద్య, హాస్పిటల్స్ మొదలైనవి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం, దాని పర్యవసానాలు, భాష బేధం, సాంస్కృతిక విభేదాలు.
* 1990లో ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దాని ఫలితాలు, రాజకీయ అసమానతలు, పరిపాలన, విద్య, ఉద్యోగాల్లో ప్రాంతీయ భేదాలు ఏర్పడటం, తెలంగాణలో వ్యవసాయ క్షామం, హస్తకళల ఆదరణ తగ్గడంతో తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం.
* తెలంగాణ అస్థిత్వం కోసం అన్వేషణ – విద్యావేత్తల చర్చలు, వాదనలు, రాజకీయ – తత్వవేత్తల కృషి, ప్రాంతీయ అసమానతలపై తిరుగులేని పోరాటం, తెలంగాణ అభివృద్ధిలో వివక్ష చూపడం.
3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 – 2014)
1. ప్రాంతీయ వివక్షపై విద్యావేత్తల, ప్రజల తిరుగుబాటు – ప్రజాసంఘాల ఏర్పాటు – ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజల ఐక్యత రావడం – ప్రత్యేక తెలంగాణ కోసం గొంతెత్తిన మొట్టమొదటి సంస్థలు – తెలంగాణ సమాచార సంస్థ – తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ – తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ – వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ విద్యార్థుల వేదిక మొదలైనవి. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు.
2. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు – 2004లో రాజకీయ పున సమీకరణాలు, ఇతర పార్టీలతో తెలంగాణ రాష్ట్రసమితి ఎన్నికల పొత్తులు, తెలంగాణ ఉద్యమ మలిదశ – యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరిక – గిర్గ్లానీ కమిటీ – తెలంగాణ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ సమితి – ప్రణబ్‌ముఖర్జీ కమిటీ – 2009 ఎన్నికలు, పొత్తులు – ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ – హైదరాబాద్ ఫ్రీజోన్‌పై ఆందోళనలు ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళనలు – కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష – 2009లో రాజకీయ ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు
3. రాజకీయ పార్టీల పాత్ర – టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, ఎంఐఎం, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మొదలైనవి. దళిత బహుజన సంఘాలు, గ్రాస్ రూట్స్ ఉద్యమ సంస్థలు – ఇతర జేఏసీ కమిటీలు, ప్రధాన ఆందోళనలు – తెలంగాణ కోసం బలిదానాలు.
* తెలంగాణలో సాంస్కృతిక పునఃనిర్మాణం – ఇతర భావ వ్యక్తీకరణలు – విద్యాసంఘాల ఏర్పాటు – కళలు, సాంస్కృతిక వ్యక్తీకరణలు – తెలంగాణ రాష్ట్ర ఆందోళనలను మహా ఉద్యమంగా మలిచినవారు – రచయితలు, కవులు, గాయకులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఎన్ఆర్ఐలు, స్త్రీలు, సామాజిక సంఘాలవారు, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సంస్థలు – ఉద్యమ తీవ్రత, ప్రధాన సదస్సులు – సకల జనుల సమ్మె – సహాయ నిరాకరణ ఉద్యమం – మిలియన్ మార్చ్ మొదలైనవి.
* పార్లమెంటరీ ప్రక్రియ – తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం మద్దతు – అఖిలపక్ష సమావేశం – ఆంటోనీ కమిటీ – తెలంగాణపై కేంద్ర హోంమంత్రి ప్రకటన – శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్, సూచనలు – పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణపై చర్చ, పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణకై ఆమోదం – ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 ఎన్నికలు – తెలంగాణ రాష్ట్రసమితి విజయం, తెలంగాణ రాష్ట్రసమితి మొదటి ప్రభుత్వం ఏర్పాటు.