TSPSC జనరల్ సైన్స్ – భారత్‌లో వివిధ పరిశోధన సంస్థలు
భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న అద్భుత ప్రగతికి ప్రధాన కారణం మన పరిశోధన సంస్థలు.. వాటికి చెందిన శాస్త్రవేత్తలు. ఈ విజ్ఞాన సంస్థలు ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తుండటంతో దేశం అభివృద్ధిపథాన ముందుకెళుతోంది. మన దేశ విజ్ఞాన వికాసానికి ఇవి పట్టుగొమ్మలుగా నిలుస్తున్నాయి. ఆ సంస్థలేమిటి? ఎక్కడ ఉన్నాయి? తదితర విజ్ఞానదాయక సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేకం.
భారత పరిశోధన సంస్థల్లో కొన్ని స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటు కాగా.. మరికొన్నింటిని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థాపించారు. గత 50 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వెనుక ఈ విజ్ఞాన సంస్థల కృషి ఎంతో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలన్నీ ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తున్నాయి. మన దేశంలో ఉన్న వివిధ సంస్థల గురించి తెలుసుకుందాం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్)
- ఇది కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ దీన్ని నిర్వహిస్తోంది. మనదేశానికి స్వాతంత్య్రం రాక ముందు రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ రిపోర్టు ఆధారంగా 1929, జులై 16న దీన్ని స్థాపించారు. పూర్వం దీన్ని ‘ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్’ అని పిలిచేవారు.
- ఐసీఏఆర్ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. దేశంలో ఉన్న 101 ఐసీఏఆర్ పరిశోధన సంస్థలను, 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను.. వాటిలో జరిగే పరిశోధలు, వ్యవసాయ సంబంధ విద్యా విషయాలను ఐసీఏఆర్ నియంత్రిస్తుంది.. నిర్వహిస్తుంది.
- పంట మొక్కలు, ఉద్యాన మొక్కలు, పశుపోషణ, చేపల పెంపకం తదితర అంశాలపై ఐసీఏఆర్ పరిశోధనలు సాగిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది. భారతదేశ మొదటి హరిత విప్లవంలో ప్రముఖ పాత్ర వహించింది. ఈ సంస్థ కృషి ఫలితంగానే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 5 రెట్లు, ఉద్యాన (హార్టీకల్చర్) మొక్కల వ్యాప్తి 9.5 రెట్లు, చేపల ఉత్పత్తి 12.5 రెట్లు, పాల ఉత్పత్తి 7.8 రెట్లు, గుడ్ల ఉత్పత్తి 39 రెట్లు పెరిగింది. భారతదేశంలో వ్యవసాయ సంబంధ ఉన్నత విద్యకు ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తోంది. ఐసీఏఆర్ ఆధ్వర్యంలో.. దేశ వ్యాప్తంగా పరిశోధనకు వివిధ నగరాల్లో డీమ్డ్ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు, రిసెర్చ్ కేంద్రాలు, నేషనల్ బ్యూరోలు, డైరక్టరేట్లు ఉన్నాయి. ఏయే కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటి పేర్లు, వివరాలను కింద చూడవచ్చు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)
- ఐసీఎంఆర్‌ను 1911లో ఇండియన్ రిసెర్చ్ ఫండ్ అసోసియేషన్ (ఐఆర్‌ఎఫ్‌ఏ)గా ప్రారంభించారు. 1949లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)గా మార్పు చేశారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ నిధులను సమకూరుస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఐసీఎంఆర్ పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. దేశంలో ప్రబలుతున్న అంటువ్యాధులపైనా.. పోషకాహార లోపం, మలేరియా, బోదకాలు, ఎయిడ్స్ లాంటి వాటిపై ఐసీఎంఆర్ పరిశోధనలు జరపడంతోపాటు, ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. సంప్రదాయ వైద్యవిధానాలను, మొక్కల ద్వారా లభించే ఔషధాలను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలు, నేషనల్ యూనిట్లు, రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. వాటి పేర్లు, వివరాలు అవి ఎక్కడ ఉన్నాయి అనే అంశాలు తెలుసుకుందాం.
ఐసీఏఆర్- డీమ్డ్ యూనివర్సిటీలు
1. ఐఏఆర్ఐ – ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, దిల్లీ
2. ఎన్డీఆర్ఐ – నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్నాల్ (హరియాణా)
3. ఐవీఆర్ఐ – ఇండియన్ వెటర్నిటీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇజత్‌నగర్ (ఉత్తర్‌ప్రదేశ్)
4. సీఐఎఫ్ఈ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఫిషరీస్ ఎడ్యుకేషన్, ముంబయి.
ఐసీఎంఆర్ – యూనిట్స్
1. ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రిసెర్చ్ సెంటర్, హైదరాబాద్ (తెలంగాణ)
2. నేషనల్ సెంటర్ ఫర్ ల్యాబొరేటరీ సైన్సెస్, హైదరాబాద్
3. వైరస్ యూనిట్, కోల్‌కతా
4. జెనెటిక్ రిసెర్చ్ సెంటర్, ముంబయి
5. మైక్రోబియల్ కంటామినెంట్ కాంప్లెక్స్, పుణె
ఐసీఎంఆర్ – రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్స్
1. రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్, భువనేశ్వర్
2. రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్, ధీభ్రూగర్
3. రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్, పోర్ట్‌బ్లెయిర్
4. డిజర్ట్ మెడిసిన్ రిసెర్చ్ సెంటర్, జోధ్‌పూర్
5. రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్, బెల్గాం
ఐసీఏఆర్- రిసెర్చ్ సెంటర్స్
1. ఎన్ఆర్సీబీ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ బనానా, ట్రిచి (తమిళనాడు)
2. ఎన్ఆర్సీజీ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్, పుణె
3. ఎన్‌ఆర్‌సీఎల్ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ లిట్చి, ముజఫర్‌నగర్
4. ఎన్ఆర్సీపీ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పొమగ్రనేట్, షోలాపూర్
5. ఎన్ఆర్సీసీ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ కామెల్, బికనీర్
6. ఎన్ఆర్సీఈ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్- హిస్సార్
7. ఎన్ఆర్సీఎం – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ మీట్- హైదరాబాద్ (తెలంగాణ)
8. ఎన్ఆర్సీవో – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ ఆర్కిడ్స్, పాక్యాంగ్- సిక్కిం
9. ఎన్ఆర్సీపీ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ పిగ్, గువహటి
10. ఎన్ఆర్సీపీబీ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ, దిల్లీ
11. ఎన్‌ఆర్‌సీఎస్‌ఎస్ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ సీడ్ స్పైసెస్ – అజ్మీర్
12. ఎన్ఆర్సీవై – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ యాక్- వెస్ట్కెమాంగ్ (అరుణాచల్‌ప్రదేశ్)
13. ఎన్‌సీఐపీఎం – నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, దిల్లీ
ఐసీఏఆర్ – డైరెక్టరేట్లు, ప్రాజెక్టు డైరెక్టరేట్లు
1. డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రిసెర్చ్, హైదరాబాద్
2. డైరెక్టరేట్ ఆఫ్ సీడ్ రిసెర్చ్, మావు (ఉత్తర్‌ప్రదేశ్)
3. డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రిసెర్చ్, జూనాగఢ్
4. డైరెక్టరేట్ ఆఫ్ సోయాబీన్ రిసెర్చ్, ఇండోర్
5. డైరెక్టరేట్ ఆఫ్ రేప్‌సీడ్ అండ్ మస్టర్డ్ రిసెర్చ్, భరత్పూర్ (ఉత్తర్‌ప్రదేశ్)
6. డైరెక్టరేట్ ఆఫ్ మష్రూం రిసెర్చ్, సోలన్ (హిమాచల్‌ప్రదేశ్)
7. డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రిసెర్చ్, పుణె
8. డైరెక్టరేట్ ఆఫ్ కాష్యూ రిసెర్చ్, పుత్తూర్ (కర్ణాటక)
9. డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ రిసెర్చ్, ఆనంద్ (గుజరాత్)
10. డైరక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చరల్ రిసెర్చ్, పుణె
11. డైరెక్టరేట్ ఆఫ్ వీడ్ రిసెర్చ్, జబల్పూర్ (మధ్యప్రదేశ్)
12. ప్రాజెక్టు డైరెక్టరేట్ ఆన్ పుట్ అండ్ మౌత్ డిసీజ్, ముక్తేశ్వర్ (ఉత్తరాఖండ్)
13. డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్, హైదరాబాద్
14. డైరెక్టరేట్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్, దిల్లీ
15. డైరెక్టరేట్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఫిషరీస్ రిసెర్చ్, బీమ్టాల్ – నైనిటాల్
ఐసీఏఆర్ ఇన్స్టిట్యూషన్స్
1. సీఐఏఆర్ఐ – సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫోర్ట్‌బ్లెయిర్
2. సీఏజెడ్ఆర్ఐ – సెంట్రల్ ఎరిడ్జోన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, జోధ్‌పూర్
3. సీవీఆర్ఐ – సెంట్రల్ ఏవియన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇజత్‌నగర్
4. సీఐఆర్ఎఫ్ఐ – సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, బార్రాక్పూర్, పశ్చిమ్ బంగ
5. సీఐబీఏ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, చెన్నై
6. సీఐఆర్‌బీ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ బఫెల్లోస్, హిస్సార్ (హరియాణా)
7. సీఐఆర్జీ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ గోట్స్, మఖ్థూమ్ (ఉత్తర్‌ప్రదేశ్)
8. సీఐఏఈ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, భోపాల్
9. సీఐఏహెచ్ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎరిడ్ హార్టికల్చర్ – బికనీర్ (రాజస్థాన్)
10. సీఐసీఆర్ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రిసెర్చ్ – నాగ్‌పూర్
11. సీఐఎఫ్టీ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ – కోచి
12. సీఐఎఫ్ఏ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్, భువనేశ్వర్
13. సీఐఆర్సీటీ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ – ముంబయి
14. సీఐఎస్టీహెచ్ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ – లఖ్‌నవూ
15. సీఐటీహెచ్ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపరేట్ హార్టికల్చర్ – శ్రీనగర్
16. సీఐపీఈటీ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, లూథియానా
17. సీఎంఎఫ్ఆర్ఐ – సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కోచి
18. సీపీసీఆర్‌ఐ – సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కాసర్‌ఘడ్ (కేరళ)
19. సీపీఆర్ఐ – సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిమ్లా
20. సీఆర్ఐజేఏఎఫ్ – సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ అల్లాయిడ్ ఫైబర్స్, బర్రాక్పూర్, (పశ్చిమ్ బంగ)
21. సీఆర్ఐడీ – సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్, హైదరాబాద్ (తెలంగాణ)
22. సీఆర్ఆర్ఐ – సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కటక్ (ఒడిశా)
23. సీఎస్డబ్ల్యూఆర్ఐ – సెంట్రల్ షీప్ అండ్ ఊల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, అవికానగర్ (రాజస్థాన్)
24. ఐఐఎస్‌డబ్ల్యూసీ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, డెహ్రాడూన్
25. సీఎస్ఎస్ఆర్ఐ – సెంట్రల్ సాయిల్ సలైనిటి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్నాల్ (హరియాణా)
26. సీటీఆర్ఐ – సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)
27. సీటీసీఆర్ఐ – సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ – త్రివేండ్రం
28. సీసీఏఆర్‌ఐ – సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, గోవా
29. ఐఏఎస్ఆర్ఐ – ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, దిల్లీ
30. ఐజీఎఫ్ఆర్ఐ – ఇండియన్ గ్రాస్లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఝాన్సీ
31. ఐఐఏబీ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, రాంచీ
32. ఐఐహెచ్ఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రిసెర్చ్, బెంగళూరు
33. ఐఐఎన్ఆర్జీ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ రెసిన్స్ అండ్ గమ్స్, రాంచీ (ఝార్ఖండ్)
34. ఐఐపీఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రిసెర్చ్, కాన్పూర్
35. ఐఐఎస్ఎస్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్, భోపాల్
36. ఐఐఎస్ఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసిస్ రిసెర్చ్ – కాలికట్
37. ఐఐఎస్ఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్‌కేన్ రిసెర్చ్, లఖ్‌నవూ
38. ఐఐవీఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ – వారణాసి
39. ఎన్‌ఏఏఆర్‌ఎం – నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ అండ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ (తెలంగాణ)
40. ఎన్ఐఏఎస్ఎం – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబయోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ – మాలేగావ్ (మహారాష్ట్ర)
41. ఎన్ఐబీఎస్ఎం – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్ స్ట్రెస్ మేనేజ్మెంట్, రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్)
42. ఎన్ఐఏఎన్పీ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ, బెంగళూరు
43. ఎన్ఐఆర్జేఏఎఫ్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఆన్ జూట్ అండ్ అల్లాయిడ్ ఫైబర్ టెక్నాలజీ – కోల్‌కతా
44. ఎన్ఐబీఈడీఐ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎపిడెమియాలజీ అండ్ డిసీజెస్ ఇన్ఫర్మాటిక్స్, హెబ్బల్ (బెంగళూరు)
45. ఎస్బీఐ – షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్, కోయంబత్తూరు
46. సీఐఆర్సీ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ కాటిల్, మీరట్ (ఉత్తర్‌ప్రదేశ్)
47. ఎన్ఐహెచ్ఎస్ఏడీ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్, భోపాల్
48. ఐఐఎంఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రిసెర్చ్, న్యూదిల్లీ
49. సీఏఆర్ఐ – సెంట్రల్ ఆగ్రో ఫారెస్ట్రీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఝాన్సీ
50. ఎన్ఐఏఈపీఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రిసెర్చ్, న్యూదిల్లీ
51. ఐఐడబ్ల్యూబీఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రిసెర్చ్, కర్నాల్
52. ఐఐఎఫ్‌ఎస్‌ఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టం రిసెర్చ్, మోదిపురం (ఉత్తర్‌ప్రదేశ్)
53. ఐఐఎంఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్, హైదరాబాద్ (తెలంగాణ)
54. ఐఐవోఆర్ –ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రిసెర్చ్, హైదరాబాద్ (తెలంగాణ)
55. ఐఐవోపీఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రిసెర్చ్- పెదవేగి (పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్)
56. ఐఐడబ్ల్యూఎం – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ మెనేజ్మెంట్, భువనేశ్వర్
57. సీఐడబ్ల్యూఏ – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్, భువనేశ్వర్
58. సీసీఆర్‌ఐ – సెంట్రల్ సిట్రస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, నాగ్‌పూర్
ఐసీఏఆర్ – నేషనల్ బ్యూరోలు
1. ఎన్‌బీపీజీఆర్ – నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, దిల్లీ
2. ఎన్బీఏఐఎం – నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్లీ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గనిజమ్స్, మావు (ఉతర్ప్రదేశ్)
3. ఎన్‌బీఏఐఆర్ – నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ – బెంగళూరు
4. ఎన్‌బీఎస్‌ఎస్‌ఎల్‌యూపీ – నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్, నాగ్‌పూర్
5. ఎన్బీఏజీఆర్ – నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్, కర్నాల్ (హరియాణా)
6. ఎన్బీఎఫ్జీఆర్ – నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, లఖ్‌నవూ
ఐసీఎంఆర్ – ఇన్స్టిట్యూట్స్
1. ఎన్జేఐఎల్వోఎండీ – నేషనల్ జల్మా ఇన్స్టిట్యూట్ ఫర్ లెప్రసి అండ్ అదర్ మైకోబ్యాక్టీరియల్ డిసీజెస్, ఆగ్రా
2. ఎన్‌ఐవోహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్, అహ్మదాబాద్
3. ఎన్ఐఈ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ, చెన్నై
4. ఎన్ఐఆర్టీ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్, చెన్నై
5. ఎన్ఐఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ – దిల్లీ
6. ఎన్ఐపీ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ, దిల్లీ
7. ఎన్ఐఎంఎస్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్, దిల్లీ
8. ఎన్ఐఎన్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ (తెలంగాణ)
9. ఎన్ఐసీఈడీ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్, కోల్‌కతా
10. సీఆర్‌ఎంఈ – సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ మెడికల్ ఎంటమాలజీ, మదురై
11. ఎన్ఐఆర్ఆర్హెచ్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్హెల్త్, ముంబయి
12. ఎన్ఐఐహెచ్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునో హెమటాలజీ, ముంబయి
13. ఈఆర్సీ – ఎంటిరో వైరస్ రిసెర్చ్ సెంటర్, ముంబయి
14. ఐసీపీవో – ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైటాలజీ అండ్ ప్రివెంటివ్ అంకాలజీ, నోయిడా
15. ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ – రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పట్నా
16. వీసీఆర్సీ వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, పాండిచ్చేరి
17. ఎన్ఐవీ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణె
18. ఎన్ఏఆర్ఐ – నేషనల్ ఎయిడ్స్ రిసెర్చ్ సెంటర్, పుణె
మాదిరి ప్రశ్నలు
1. పశుపోషణ, పాల ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలు నిర్వహించే ఏ సంస్థ హరియాణాలోని కర్నాల్‌లో ఉంది?
ఎ) నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
బి) ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
సి) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ బఫెలోస్
డి) ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
జ: (ఎ)
2. సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
ఎ) కటక్ బి) భువనేశ్వర్ సి) కర్నాల్ డి) డెహ్రాడూన్
జ: (ఎ)
3. ఐసీఎంఆర్‌కు చెందిన ఏ పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి?
ఎ) సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై లాండ్ అగ్రికల్చర్
బి) నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ అండ్ మేనేజ్మెంట్
సి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్
డి) పైవన్నీ
జ: (డి)
4. సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
ఎ) లక్నో బి) సిమ్లా సి) కోచి డి) కటక్
జ: (బి)
5. కిందివాటిలో దిల్లీలో లేని పరిశోధనా సంస్థ ఏది?
ఎ) ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
బి) ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
సి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రిసెర్చ్
డి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రిసెర్చ్
జ: (సి)
6. నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ఎక్కడ ఉంది?
ఎ) సిక్కిం బి) హైదరాబాద్ సి) అజ్మీర్ డి) దిల్లీ
జ: (బి)
7. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌కు చెందిన ఏ సంస్థ హైదరాబాద్‌లో ఉంది?
ఎ) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
బి) ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రిసెర్చ్ సెంటర్
సి) నేషనల్ సెంటర్ ఫర్ ల్యాబోరేటరి సైన్సెస్
డి) పైవన్నీ
జ: (డి)
8. నేషనల్ ఎయిడ్స్ రిసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది?
ఎ) నోయిడా బి) పట్నా సి) పుణె డి) పాండిచ్చేరి
జ: (సి)
9. కిందివాటిలో ఐసీఎంఆర్‌కు చెందిన ఏ సంస్థ దిల్లీలో ఉంది?
ఎ) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ
బి) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్
సి) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్
డి) పైవన్నీ
జ: (డి)
Leave a Reply