APPSC | TSPSC Group II Paper I సామాజిక మినహాయింపు – సమాజంలో ‘మధ్యతరగతి’
- సామాజిక జీవన క్రమంలో మధ్య తరగతి అనే మాట వినని వారుండరు. వీరి జీవితమంతా మధ్యస్థమే.. అసలు మధ్య తరగతి వారంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సంక్లిష్టంగా ఉంటుంది. మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉండేది మధ్య తరగతి ప్రజలే. ఆదాయం, సామాజిక జీవనం తదితర లెక్కల ఆధారంగా రకరకాలుగా వీరిని విశ్లేషించవచ్చు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో సోషల్ ఎక్స్‌క్లూజన్ సబ్జెక్టులోని ప్రధానాంశాల్లో మధ్య తరగతి ఒకటి.
- మధ్యతరగతి అనే పదాన్ని నిర్వచించడం ఒక రకంగా సంక్లిష్టమైన ప్రయత్నం. సాంఘిక హోదా, వార్షికాదాయం, సామాజిక లక్షణాల ఆధారంగా ‘మధ్యతరగతి’ అనే సాంఘిక సమూహాన్ని వర్ణించవచ్చు.
»‘సాంఘిక హోదా’ కోణంలో చూస్తే.. మధ్యతరగతిని సామాజిక గుర్తింపు అధికంగా ఉన్న వృత్తిదారుల సమూహంగా భావించవచ్చు.»కేంబ్రిడ్జ్ నిఘంటువు (డిక్షనరీ) నిర్వచనం ప్రకారం.. ‘విద్యాధికులైన వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు మొదలైన వారి సమూహం. మంచి ఉద్యోగంతోపాటు చెప్పుకోదగిన ఆదాయం కలిగినవారు.’ (పట్టిక – 1 చూడండి)
- సామాజిక భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయ కోణంలో మధ్యతరగతిని ముఖ్య ఆదాయ తరగతిగా విశ్లేషించారు. ఆదాయంతో సంబంధం లేకుండా వివిధ సామాజిక పరివర్తనలు, ప్రక్రియల్లోని ప్రబల భాగస్వామ్యం ఆధారంగా ‘సామాజిక మధ్యతరగతి’ని నిర్వచించవచ్చనే అభిప్రాయం కూడా ఉంది.
»సంప్రదాయ, ఆధునికతకు మధ్య పరివర్తన దశల్లో ప్రతిబింబించే సామాజిక వర్గమే మధ్యతరగతి వర్గం. వివిధ సామాజిక అంశాల్లో ‘పరిపక్వత’ స్థాయిని ప్రామాణికంగా తీసుకుని ఈ విధమైన సామాజిక విభజన చేశారు. (పట్టిక – 2 చూడండి)
మధ్యస్థమే..
- మధ్యతరగతి అనేది అటు సంప్రదాయ, ఇటు ఆధునికతకు మధ్య రకంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో ఆధునిక లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నట్లే ఉన్నా.. మరికొన్ని సందర్భాల్లో ‘ఆధునికత’ అదృశ్యమై సంప్రదాయం ప్రాబల్యం వహిస్తున్నట్లుగా ఉంటుంది. ఒక రకంగా ‘మధ్యతరగతి’ వర్గం సంప్రదాయ, ఆధునికతల సమ్మేళనంగా ఉంటుంది.
»ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో 2001-2011 మధ్య జరిగిన ఆర్థిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ‘పీఈడబ్ల్యూ రిసెర్చ్ స్టడీ’ జరిపిన అధ్యయనాల ప్రకారం… భారతదేశంలో ‘మధ్య ఆదాయ తరగతి’ సామాజిక చట్రంలో ఏ విధంగా ప్రతిబింబిస్తుందో పట్టిక-3లో చూడవచ్చు.
మధ్యతరగతి లక్షణాలు
»దేశంలోని మొత్తం ప్రజానీకంలో వీరిదే మెజారిటీ వాటా. దాదాపు 80% మంది ఈ వర్గానికి చెందినవారే.
»మధ్యతరగతిలో కూడా దిగువ మధ్యతరగతికి చెందినవారు దాదాపు 77% మంది ఉన్నారు.
»గత దశాబ్ద కాలంలో దిగువ మధ్యతరగతిలోనే పెరుగుదల అధికంగా కనిపిస్తోంది (సుమారు 14%).
»ఆర్థిక సంస్కరణల ఫలితంగా పేదరికం తగ్గినా, ఆర్థిక వ్యవస్థలో దాని ప్రభావం ఆశించిన స్థాయిలో ధనాత్మకంగా రాణించలేదు.
»సామాజికంగానూ మధ్యతరగతి కుటుంబాల సంఖ్య అధికమే.
»కుటుంబ పరిమాణం రీత్యా మధ్యతరగతి కుటుంబాల్లోనే సభ్యుల సంఖ్య ఎక్కువ.
»మిగిలిన రెండు సామాజిక వర్గాలతో పోలిస్తే సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, పట్టింపులు ఈ వర్గంలోనే ఎక్కువ. ఉల్లంఘన కూడా అదే స్థాయిలో ఉంటుంది.
»పరిమిత వనరులు, అపరిమిత ఆశలతో అసంతృప్తికి గురవుతూ ఉంటారు.
»కుటుంబ వ్యవస్థలో సంఘర్షణ ఎక్కువ. విడాకుల రేటు కూడా మిగిలిన రెండు సామాజిక వర్గాల కంటే ఎక్కువే.
»సామాజిక విషయాల పట్ల అతి త్వరగా స్పందిస్తారు. ఏకీభవించే అంశాలు మాత్రం కనిపించవు. సామాజిక సమస్యల పట్ల విభిన్నత, ఏకీకరణ, పునరేకీకరణ లాంటి ప్రక్రియలు తరచూ జరుగుతూ ఉంటాయి.
1. మహిళలపై జరుగుతున్న ప్రధాన హింస రూపం ఏది?
జ: భర్త, బంధువుల దౌర్జన్యం
2. మానవ అక్రమ రవాణాపై అధ్యయనం జరిపిన కమిటీ ఏది?
జ: వర్మ కమిటీ
3. సామాజిక మినహాయింపు లక్ష్యం ఏమిటి?
ఎ) పెత్తనం
బి) అధికారం
సి) ప్రయోజనాలు గుత్తగా పొందడం
డి) పైవన్నీ
4. సామాజిక నిర్మితుల అధ్యయనానికి ఉపకరించేవి ఏవి?
జ: ఏకీభవించే లక్షణాలు,విభేదించే లక్షణాలు
5. కులాన్ని అంతర వివాహ సమూహంగా నియంత్రించడానికి కారణం ఏమిటి?
ఎ) శుద్ధత
బి) వృత్తి రహస్యత
సి) సంఘర్షణలు రాకుండా
డి) పైవన్నీ
6. కుల పంచాయతీ విధులు ఏమిటి?
ఎ) కార్యనిర్వాహక
బి) న్యాయ
సి) విధానపరమైన
డి) పైవన్నీ
7. తెలంగాణలో ఎన్ని ‘ఐటీడీఏ’లు ఉన్నాయి?
జ: 4
8. తెలంగాణలో ఆదిమ తెగ కానిది ఏది?
జ: ఏదీకాదు
9. అనాథలను తెలంగాణ ప్రభుత్వం ఏ సామాజిక వర్గంలో చేర్చింది?
జ: బీసీ-ఏ
10. తెలంగాణలో మత్య్సకారుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
మెదక్
11. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అంగన్వాడీలు ఎన్ని?
జ: 37,700
12. ఏ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ వైకల్య సంవత్సరం’గా గుర్తించారు?
జ: 1981
13. తాజా గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగదల రేటు ఎంత?
జ: 0.8%
14. నిర్భయ చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణిస్తారు?
జ: 15
15. వివాహానంతరం యువకుడు బయటకు వెళితే … ?
జ: మాతృస్వామిక
16. ఒక వ్యక్తికి ఎన్ని రకాల ద్వితీయ బంధువులు ఉంటారు?
జ: 32
17. ‘వెట్టి’ కార్మిక నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
జ: 1976
18. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు అందుకునేవారు (సుమారుగా) ఎంత మంది ఉన్నారు?
జ: 14 లక్షలు
Leave a Reply