TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part XII
తెలంగాణకు ‘ఇండియా టుడే’ పురస్కారం
»‘ఇండియా టుడే స్టేట్స్ ఆఫ్ ది స్టేట్స్ కాన్క్లేవ్-2015’ పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. సమీకృత అభివృద్ధి విభాగంలో ఈ అవార్డు దక్కింది.
»2015, నవంబరు 6న దిల్లీలో జరిగిన ఇండియా టుడే సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు.
»తెలంగాణకు ‘ఇండియా టుడే’ పురస్కారం లభించడం వరుసగా ఇది రెండోసారి. 2014, అక్టోబరు 31న తొలిసారి ఉత్తమ మౌలిక వసతుల విభాగంలో ఈ అవార్డు లభించింది.
‘తెలంగాణ రాష్ట్రోదయం’
- తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆచార్య కోదండరాం (ముద్దసాని కోదండరాం రెడ్డి) రచించిన ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకాన్ని 2015, నవంబరు 4న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
అపార్డ్.. టీఎస్ఐపీఏఆర్డీగా మార్పు
- హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ – ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్- (సీడీఎస్ ఏపీఏఆర్డీ) పేరును ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ – తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీడీఎస్-టీఎస్ఐపీఏఆర్డీ) గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015, నవంబరు 6న ఉత్తర్వులు జారీ చేసింది.
»‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ – ఏపీఏఆర్డీ’ అనేది గ్రామీణాభివృద్ది శిక్షణ సంస్థలో భాగంగా ఏర్పాటు చేసుకున్న రిజిస్టర్డ్ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతం) పబ్లిక్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1350 ఎఫ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు.
»1954లో కేంద్ర ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ కో-ఆపరేషన్’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘డెవలప్మెంట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్ పేరిట ఈ సంస్థ ప్రారంభమైంది.
»2002లో దీన్ని ‘ఎ.మాధవరెడ్డి – ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఏఎంఆర్ – ఏపీఏఆర్డీ) గా రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది.
»పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అనుబంధంగా పనిచేస్తున్న వారికి శిక్షణ ఇవ్వడం, ఆ శాఖ పురోగతికి మార్గాలు అన్వేషించడం, శాఖల పనితీరును గమనిస్తూ వాటి కార్యకలాపాలను మదింపుచేయడం ‘అపార్డ్’ స్థాపన ప్రధాన ఉద్దేశం.
»గ్రామీణాభివృద్దిలో ముఖ్యమైన పాత్ర వహించే మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, గిరిజన సంక్షేమం లాంటి ఇతర శాఖలకు అవసరమైన శిక్షణా కార్యకలాపాలను ‘అపార్డ్ నిర్వహిస్తుంది.
»పంచాయతీరాజ్ సంస్థలో పనిచేసే సిబ్బంది, ఎన్నికైన ప్రజాప్రతినిధుల శిక్షణ కోసం అయిదు ప్రాంతీయ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్స్‌ను ‘అపార్డ్ ఏర్పాటు చేసింది. అవి..
- 1. రాజేంద్రనగర్ ఈటీసీ – రంగారెడ్డి, మెదక్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్
- 2. సామర్లకోట ఈటీసీ – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి
- 3. బాపట్ల ఈటీసీ – కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
- 4. శ్రీకాళహస్తి ఈటీసీ – చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం
- 5. హసన్‌పర్తి ఈటీసీ – వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్
»అపార్డ్ ప్రతినెలా ‘స్థానిక పాలన పేరుతో మాస పత్రికను ప్రచురిస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1.వాల్మీకి జయంతిని ప్రభుత్వం ఏ రోజున అధికారికంగా నిర్వహించింది?
ఎ) అక్టోబరు 26 బి) అక్టోబరు 27 సి) అక్టోబరు 28 డి) అక్టోబరు 29
జ:అక్టోబరు 27
2.8వ జాతీయ విత్తన కాంగ్రెస్-2015 సదస్సును అక్టోబరు 27 నుంచి 29 వరకు ఎక్కడ నిర్వహించారు?
ఎ) చెన్నై బి) బెంగళూరు సి) ముంబయి డి) హైదరాబాద్
జ:హైదరాబాద్
3.2015, నవంబరు 5న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీ-హెచ్ ఆవరణలో ప్రారంభించిన టీ-హబ్‌ను ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు భాగస్వాములైన ఇతర సంస్థలు ఏవి?
ఎ) ఐఐఐటీ-హెచ్ బి) ఐఎస్బీ సి) నల్సార్ డి) పైవన్నీ
జ:పైవన్నీ
4.ఇంటర్నెట్.వోఆర్జీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇన్ ఇండియా అవార్డుకు ఇటీవల ఎంపికైన హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ ఏది?
ఎ) బోధశిష్య బి) బోధగురు సి) బోధసార డి) ఏకలవ్య
జ:బోధగురు
5.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కొనగాల మహేష్‌కి ఇటీవల ఏ పురస్కారం లభించింది?
ఎ) పద్మశ్రీ బి) పద్మభూషణ్ సి) భారతజ్యోతి డి) రామన్‌మెగసెసే
జ:భారతజ్యోతి
6.తెలంగాణ రాష్ట్రానికి ‘ఇండియా టుడే స్టేట్స్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్-2015 పురస్కారం కింది ఏ విభాగంలో లభించింది?
ఎ) పట్టణాభివృద్ధి బి) నీటిపారుదల అభివృద్ధి సి) సమీకృత అభివృద్ధి డి) విద్యాభివృద్ధి
జ:సమీకృత అభివృద్ధి
7.తెలంగాణ రాష్ట్రోదయం గ్రంథ రచయిత ఎవరు?
ఎ) ఆచార్య కోదండరాం బి) జూలూరి గౌరీశంకర్ సి) చుక్కా రామయ్య డి) రామ మెల్కొటే
జ:ఆచార్య కోదండరాం